News February 1, 2025

నిజామాబాద్ జిల్లా వెదర్ అప్డేట్@8AM

image

నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా పోతంగల్లో 17℃, నిజామాబాద్ 17.1, మోస్రా 17.2, జకోరా 17.3, మోర్తాడ్ 17.4, యడపల్లి 17.5, సాలూరా 17.6, పల్డా, మల్లాపూర్ 17.7, గోపన్నపల్లి, ఏర్గట్ల, జానకంపేట్ 17.8, చందూర్ 17.9, మెండోరా, కొటగిరి, చిన్న మవంది, డిచ్‌పల్లి, చకొండూరు, కల్లూరి 18, లక్స్మాపూర్, బెల్లాల్, గన్నారం, నిజామాబాద్ పట్టణంలో 18.1℃గా నమోదయ్యాయి.

Similar News

News November 10, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన CP

image

నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు, మహిళా కానిస్టేబుల్‌ను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. సాయి నగర్-2 నుంచి హోంగార్డ్ అల్లం భూమయ్య ఆయన కూమర్తె మహిళా కానిస్టేబుల్ అల్లం మాధురిని నిన్న రాత్రి బైక్‌పై విధులకు తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News November 10, 2025

NZB: 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

జిల్లాలో ఇప్పటికే దాదాపు 50% మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.

News November 10, 2025

అకోలా-కాచిగూడ రైలులో ఒకరి హత్య

image

అకోల నుంచి కాచిగూడ వెళ్లే రైలులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి సోమవారం తెలిపారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. ఉమ్మడి గ్రామానికి చెందిన అతిశ రైలులో వాటర్ బాటిల్ అమ్ముకుంటూండగా, అదే గ్రామానికి చెందిన షేక్ జమీర్ వాటర్ బాటిల్ విషయంలో గొడవ పడ్డారు. దీంతో జమీర్ గాజు సీసాతో అతిశపై దాడి చేయగా మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కరికెల్లి, ధర్మాబాద్ మధ్యలో జరిగింది.