News March 19, 2024
జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలి: వర్మ

గొల్లప్రోలు మండలం చందుర్తిలో నిర్వహించిన బీసీ, ఎస్సీల అవగాహన సదస్సులో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ- జనసేన- బీజీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం నియోజవర్గ అభివృద్ధి విషయంలో సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News April 1, 2025
రాజమండ్రి: తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితా నగర్‌కు చెందిన దేవాబత్తుల నాగ మహేశ్‌ని త్రీ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా, మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పారావు హెచ్చరించారు.
News March 31, 2025
KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.
News March 31, 2025
అర్ధరాత్రి కారు వీరంగం.. ఇద్దరు స్పాట్‌డెడ్

రాజమండ్రి రూరల్ కొంతమూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీపేటకి చెందిన ఈర్లు నాగబాబు (44) ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి బైక్ రైడ్‌లో ఉండగా మనీష్ ఫంక్షన్ హాల్ వద్ద మద్యం మత్తులో కారులో నలుగురు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టారు. దీంతో నాగబాబుతో పాటు వెనక కూర్చున్న కస్టమర్ వీరబాబు(28) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.