News February 1, 2025
నందికొట్కూరులో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మృతి

నందికొట్కూరుకు చెందిన రిటైర్డ్ టీచర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇందిరాబాయి (90) శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1993లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయులిగా రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు.
Similar News
News November 4, 2025
ఫ్లాప్స్ వచ్చినా ఆఫర్లకు కొదవలేదు..

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా హీరోయిన్ శ్రీలీల హవా కొనసాగుతోంది. పెళ్లి సందడితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ధమాకా, భగవంత్ కేసరి వంటి హిట్లు ఖాతాలో వేసుకున్నారు. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, మాస్ జాతర అలరించలేకపోయాయి. 10కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి సక్సెస్ రేట్ 30శాతమే ఉంది. ప్రస్తుతం శ్రీలీల 3-4 సినిమాల్లో నటిస్తున్నారు.
News November 4, 2025
‘Admin123’.. అంతా కొట్టేశాడు!!

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్‌కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్‌వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్వర్డ్‌తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.
News November 4, 2025
జీలుగుమిల్లి: ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి

జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో మంగళవారం ఉదయం ట్రాక్టర్ అదుపుతప్పి అఖిల్ (22) మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి ఎస్.ఐ వి. క్రాంతికుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


