News February 1, 2025

దారుణం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు!

image

TG: తల్లి మృతదేహం పక్కనే డిప్రెషన్‌తో ఇద్దరు కూతుళ్లు 9రోజులు గడిపారు. HYDలోని బౌద్ధనగర్‌కు చెందిన రాజు, లలిత(45)కు రవళిక, అశ్విత ఇద్దరు కుమార్తెలు. 4ఏళ్ల క్రితం వీరిని వదిలేసి రాజు ఎక్కడికో వెళ్లాడు. ఈ క్రమంలో లలిత గుండెపోటుతో మరణించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు కూడా చనిపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో నిన్న బాహ్య ప్రపంచానికి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News February 1, 2025

రేపు ‘తండేల్’ ప్రీరిలీజ్ వేడుక

image

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈసారి అసలు గురి తప్పేదే లేదూ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

News February 1, 2025

శోభిత అభిప్రాయాలంటే నాకు చాలా గౌరవం: నాగచైతన్య

image

భార్య శోభిత సలహాల్ని తాను అనుసరిస్తుంటానని నటుడు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నప్పుడు నా ఆలోచనను శోభితతో పంచుకుంటుంటాను. ఒత్తిడిలో ఉన్నానంటే ఇట్టే గుర్తుపట్టేసి ఏమైందని అడుగుతుంది. తను ఎప్పుడూ ప్రశాంతంగా, చక్కగా ఆలోచిస్తుంది. మంచి సలహాలిస్తుంది. అందుకే తన అభిప్రాయాల్ని నేను చాలా గౌరవిస్తాను’ అని కొనియాడారు.

News February 1, 2025

పాత Income Tax పద్ధతికి ఇక గుడ్‌బై!

image

కొత్త Income Tax విధానంలో రూ.12.75L వరకు ట్యాక్స్ లేకపోవడంతో ఇక పాత పద్ధతి మురిగిపోయినట్టే! ఇందులో శ్లాబు రేట్లను యథాతథంగా ₹2.5L వరకు 0, ₹2.5L- ₹3L వరకు 5%, ₹3L- ₹5L వరకు 5%, ₹5L- ₹10L వరకు 20%, ₹10L పైన 30% వద్దే ఉంచేశారు. ఇందులో బెనిఫిట్స్ రావాలంటే HRA, హోమ్ లోన్స్, SEC 80C కింద క్లెయిమ్స్ చేసుకోవాలి. లేదంటే రూ.వేల నుంచి లక్షల్లో పన్ను కట్టాల్సిందే. అందుకే కొత్త ITకే అందరూ మొగ్గు చూపడం ఖాయం.