News February 1, 2025

MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు

image

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్‌పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్‌లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్‌కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 12, 2025

త్వరలో ఈ జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం

image

తెలంగాణలో ఆయిల్ పామ్ ఉత్పత్తిని పెంచేలా త్వరలో పలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం కానున్నాయి. సిద్దిపేటలోని నర్మెట్టలో ఆయిల్ ఫెడ్, పెద్దపల్లిలో తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ, ఖమ్మంలో గోద్రెజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ, వనపర్తిలో ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ, ఖమ్మంలోని కల్లూరు గూడెంలో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ, గద్వాల్‌లోని బీచుపల్లిలో ఆయిల్ ఫెడ్, ములుగులో K.N.బయోసైన్సెస్ ఫ్యాక్టరీలు AUG-2026 నాటికి ప్రారంభంకానున్నాయి.

News November 12, 2025

బందోబస్తు ఏర్పాటును పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ

image

వేములవాడ పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పరిశీలించారు. రాజన్న ఆలయంలో భక్తులకు ప్రవేశాలను నిలిపివేసిన నేపథ్యంలో ఆలయ పరిసరాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బందోబస్తును ఇన్చార్జి సీఐ శ్రీనివాస్, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ సీఐ రవికుమార్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించి పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

News November 12, 2025

తాళ్లకోడు లేఔట్‌లో సామూహిక నూతన గృహప్రవేశాలు

image

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల లేఔట్‌లో NTR కాలనీలో సమూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. పలువురి లబ్ధిదారులకు నూతన గృహ రుణ పత్రాలు అందించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సర్పంచ్ అనురాధ ఉన్నారు.