News February 1, 2025

సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

image

సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి<<>> కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్‌కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.

Similar News

News November 11, 2025

IIIT కళ్యాణిలో ఉద్యోగాలు

image

<>IIIT కళ్యాణి,<<>> పశ్చిమబెంగాల్‌లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PG, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: iiitkalyani.ac.in

News November 11, 2025

విద్యారంగంలో ఆజాద్ కృషి అద్వితీయం: KMR కలెక్టర్

image

భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మంగళవారం KMR కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆజాద్ భారత స్వాతంత్ర్య సమరయోధుడని, 1947 నుంచి 1958 వరకు విద్యా మంత్రిగా పనిచేసి, UGC, IITల వంటి ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటుకు పునాది వేశారని కలెక్టర్ కొనియాడారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

News November 11, 2025

ఆర్టీసీకి కార్గో లాభాల పంట!

image

విజయవాడ RTC జోనల్‌లో కార్గో సేవలు లాభాల పంట పండిస్తున్నాయి. గత ఏడాది మొత్తం రూ.114 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి, అరటి పంట, ఇతర సరుకులను నేరుగా మార్కెట్ నుంచే రవాణా చేయడంతో లాభాలు పెరిగాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంటికి వచ్చి పార్సెల్ పికప్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో RTC ఉన్నట్లు తెలుస్తోంది.