News February 1, 2025

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 60% పూర్తి

image

AP: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉ.10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 60% పంపిణీ పూర్తయింది. ఉదయం పింఛన్ల పంపిణీ ప్రారంభించిన కాసేపటికే సర్వర్‌లో సమస్య తలెత్తడంతో కాసేపు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమస్య పరిష్కారం అవడంతో ఎలాంటి అంతరాయం లేకుండా పెన్షన్లను అందజేస్తున్నారు. కాసేపట్లో అన్నమయ్య(D) మోటుకట్లలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Similar News

News January 5, 2026

వాల్‌నట్స్ వీరు తినకూడదు

image

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మెదడు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు, రక్తస్రావ రుగ్మతలు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, మూత్రపిండాల్లో రాళ్లున్నవారు, శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వాళ్లు ఇవి తీసుకోకూడదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

News January 5, 2026

USలో తెలుగు యువతి హత్య.. ఇండియాలో నిందితుడి అరెస్ట్?

image

USలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి నిఖిత గొడిశాల(27) హత్యకు గురైన కేసులో నిందితుడు అర్జున్ శర్మ అరెస్ట్ అయినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఆ కథనాల ప్రకారం.. ఇంటర్‌పోల్ సాయంతో అతణ్ని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు తెలివిగా ఇండియాకు పారిపోయివచ్చాడు.

News January 5, 2026

సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

image

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.