News February 1, 2025
NGKL: మైనర్ బాలికకు వేధింపులు.. కేసు నమోదు

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 6, 2025
మహబూబ్‌నగర్: లారీ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలమూరు యూనివర్సిటీ ఎదురుగా సైకిల్‌పై వస్తూ నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన లారీ( ట్రక్కు) కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పాలమూరు యూనివర్సిటీ నుంచి అర కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
News March 6, 2025
జడ్చర్ల: క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి హత్య

క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి <<15574517>>వ్యక్తిని <<>>హత్య చేసిన ఘటన MBNR జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో జరిగింది. హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో పోలీసులు బుధవారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 24వ తేదీన క్రేన్ మరమ్మతు కోసం పుణేకు చెందిన వినయ్ రాగా అతను బస చేస్తున్న గది వద్ద బిహార్‌కు చెందిన రషీద్‌తో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతన్ని గోడకేసి బాది చంపేశాడు.
News March 6, 2025
విద్యార్థినికి నియామక పత్రం అందజేసిన సీఎం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థిని పూజిత మొన్న వనపర్తిలోని ఉద్యోగం మేళాకు ఎంపికైంది. త్రెడ్ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించిన పూజితకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కే.ఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థి మంచి ఉద్యోగం సాధించడం తమకు గర్వకారణం అన్నారు