News February 1, 2025
ఎన్టీఆర్: 67.38% మేర జరిగిన పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 67.38% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,29,914 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,54,926 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసింది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీ ప్రక్రియకు రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు.
Similar News
News February 1, 2025
ముస్తాబాద్: గూడు లేక.. రాత్రంతా అంబులెన్సులోనే మృతదేహం
ముస్తాబాద్‌కి చెందిన బిట్ల సంతోష్ (48) అనే నేత కార్మికుడు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి భార్య శారద ముగ్గురు పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు అభ్యర్థించారు.
News February 1, 2025
AP పట్ల కేంద్రానికి ఇంతటి నిర్లక్ష్యమెందుకు?: జైరామ్ రమేశ్
కేంద్ర ప్రభుత్వం బిహార్‌కు బొనాంజా ప్రకటించి కూటమిలోనే భాగమైన ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం అత్యంత క్రూరంగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ ట్విటర్లో విమర్శించారు. ‘త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి బిహార్‌కు కేంద్రం వరాలు కురిపించింది. అది సహజమే. కానీ ఎన్డీయేకు మూలస్తంభంలా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకంత క్రూరంగా నిర్లక్ష్యం చేసింది?’ అని ప్రశ్నించారు.
News February 1, 2025
అనకాపల్లి: ఎన్నికలు ముగిసేవరకు పరిష్కార వేదిక నిలుపుదల
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిలుపు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. మార్చి 8వ తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుందన్నారు. ఆ తర్వాత నుంచి ప్రజావేదిక కొనసాగిస్తామని ప్రజలు గమనించాలని కోరారు.