News February 1, 2025

NGKL: మైనర్‌ బాలికకు వేధింపులు.. కేసు నమోదు

image

ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 1, 2025

MBNR: రిజర్వాయర్‌లో పడి చిన్నారులు మృతి

image

ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News February 1, 2025

కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?

image

యావత్ దేశం మొత్తం ఎదురుచూసే బడ్జెట్ వచ్చేసింది. ₹50.65 లక్షల కోట్లతో పద్దులను నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ₹12 లక్షల ఆదాయం వరకు పన్ను లేకపోవడం, క్యాన్సర్ సహా 36 ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తొలగించడం, బీమా రంగంలో 100% FDI పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని ₹3 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంచడం, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్‌పై మీ కామెంట్ ప్లీజ్.

News February 1, 2025

ఉమ్మడి ADB జిల్లాలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..!

image

మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5, 512 మంది ఉపాధ్యాయులు, 67, 768 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.