News March 19, 2024
PUTIN: గూఢచారి నుంచి అధ్యక్షుడి దాకా!
వ్లాదిమిర్ పుతిన్ మరోసారి రష్యా అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. పుతిన్ 1975లో గూఢచార సంస్థ కేజీబీలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1991లో రాజకీయాల్లోకి వచ్చి సెయింట్ పీటర్స్బర్గ్ మేయర్గా ఎన్నికయ్యారు. అనంతరం 1999లో 46 ఏళ్ల వయసులో రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2000లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్లుగా పుతిన్ రష్యాను ఏలుతున్నారు. ఆయన 2030 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
Similar News
News January 9, 2025
సీఎం ఆదేశాలు.. తిరుపతికి బయల్దేరిన ముగ్గురు మంత్రులు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులు తిరుపతికి బయల్దేరారు. అక్కడి పరిస్థితులను వారు దగ్గరుండి సమీక్షించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అటు రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు.
News January 9, 2025
జనవరి 09: చరిత్రలో ఈరోజు
* 1915: మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చిన రోజు
* 1922: ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు, నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా జననం
* 1934: బాలీవుడ్ సింగర్ మహేంద్ర కపూర్ జననం
* 1965: సినీ డైరెక్టర్, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పుట్టినరోజు
* 1969: తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభం
* ప్రవాస భారతీయుల దినోత్సవం
News January 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.