News February 1, 2025

కొత్త ఐటీ శ్లాబ్‌లు ఇవే

image

బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు.
*0-4 లక్షల వరకు NIL
*రూ.4 లక్షల-8 లక్షల వరకు 5%
*8 లక్షల-12 లక్షల వరకు 10%
*12 లక్షల-16 లక్షల వరకు 15%
*16 లక్షల- 20 లక్షల వరకు 20 %
*20 లక్షల-24 లక్షల వరకు 25%
*24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.

Similar News

News November 2, 2025

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

image

దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవరించిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పింది. ఆ తర్వాత బలపడి బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఈ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు లేనట్లే తెలుస్తోంది. అటు ఏపీలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నట్లు తెలిపింది.

News November 2, 2025

జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!

image

AP: నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘జోగి రమేశ్ ప్రోద్బలంతోనే మద్యం తయారు చేశాం. వ్యాపారంలో నష్టపోయిన నాకు రూ.3కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టారు. ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారు’ అని రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

News November 2, 2025

అగ్‌హబ్ ఫౌండేషన్‌లో ఉద్యోగాలు

image

HYDలోని అగ్‌హబ్ ఫౌండేషన్ రూరల్ కోఆర్డినేటర్(2), కమ్యూనికేషన్ మేనేజర్(1) పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ(మార్కెటింగ్, జర్నలిజం& మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్), డిగ్రీ( అగ్రికల్చర్ అనుబంధ కోర్సులు) ఉత్తీర్ణులు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు NOV 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://pjtau.edu.in/