News March 19, 2024

తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా నజీర్?

image

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజీనామా చేయడంతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యేవరకు కొత్త గవర్నర్‌ను నియమించేందుకు వీల్లేదు. ఈ నేపథ్యంలోనే నజీర్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ తాత్కాలిక బాధ్యతల్ని తమిళనాడు గవర్నర్ రవికి ఇవ్వొచ్చని తెలుస్తోంది.

Similar News

News January 3, 2026

గంజాయిని పెంచిపోషిస్తోంది కూటమి నేతలే: YCP

image

AP: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు HYDలో <<18752425>>గంజాయి<<>> తీసుకుంటూ దొరకడంపై వైసీపీ స్పందించింది. ‘సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపారు. అప్పుడే కేసు రాజీ కోసం ఏపీ నుంచి కూటమి నేతలు రంగంలోకి దిగారు. హోంమంత్రి అనిత తెగ నీతులు చెప్పారు కదా. ఇప్పటికైనా ఒప్పుకుంటారా గంజాయిని పెంచి పోషిస్తోంది మీ కూటమి నేతలేనని?’ అంటూ ప్రశ్నించింది.

News January 3, 2026

IIIDMలో నాన్ టీచింగ్ పోస్టులు

image

IIIT డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కర్నూలు 16 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/B.Tech/MSc/MCA, ME/MTech, MBA, BSc నర్సింగ్, B.PEd, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitk.ac.in

News January 3, 2026

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్

image

TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కీలకమైన నీటి అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంటే సభ్యులు లాబీలో తిరగడంపై సీరియస్ అయ్యారు. సభలో ఎవరూ లేకపోవడంతో వారిని వెంటనే లోపలికి పిలిపించాలంటూ విప్‌లను ఆదేశించారు.