News February 1, 2025
MBNR: బి-ఫార్మసీ పరీక్షలు ప్రారంభం

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బి-ఫార్మసీ సెమిస్టర్-3 పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. బార్కోడ్స్‌పై వివరాలు సరిచూసుకోవాలని, పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Similar News
News January 14, 2026
సంగారెడ్డి: త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తాం: మంత్రి

తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన 1257 మందికి నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య శాఖలో గత రెండేళ్లలో 9,572 ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.
News January 14, 2026
జితేశ్ శర్మ ఆల్‌టైమ్ IPL టీమ్.. విరాట్ కోహ్లీకి నో ప్లేస్

RCB వికెట్‌కీపర్ జితేశ్ శర్మ తన ఆల్‌టైమ్ IPL టీమ్‌ను ప్రకటించారు. అయితే ఇందులో కోహ్లీకి చోటు ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది. 2025 సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ విజయంలో కోహ్లీ (657 పరుగులు) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. జితేశ్ తన జట్టుకు ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే విధంగా రోహిత్, గిల్‌క్రిస్ట్, సూర్యకుమార్, కల్లిస్, ABD, బుమ్రా, హేజిల్‌వుడ్, హార్దిక్, అక్షర్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
News January 14, 2026
టేక్మాల్: పతంగి ఎగరేస్తూ బిల్డింగ్ నుంచి పడ్డాడు!

టేక్మాల్ గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. భవనంపై పతంగి ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి లక్ష్మణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మొదటి అంతస్తు నుంచి పడటంతో లక్ష్మణ్ కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు.


