News February 1, 2025

కేంద్ర మంత్రితో బాపట్ల ఎంపీ భేటీ

image

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి H.D కుమారస్వామిని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ నిమిత్తం రూ.11,440 కోట్లు కేటాయించినందుకు ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు విషయాలను ప్రస్తావించారు.

Similar News

News February 1, 2025

Income Tax: 33% కాదు.. ₹15Lపై 6, ₹25Lపై 13శాతమే పన్ను

image

మోదీ సర్కారు వేతన జీవులకు భారీ ఊరటే కల్పించింది. Income Tax భారాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఇకపై ₹13Lకు చెల్లించేది ₹75వేలే. ₹14Lకు ₹90వేలు, ₹15Lకు ₹1.05L, ₹16Lకు ₹1.20L మాత్రమే. అంటే ఎఫెక్టివ్‌లీ వార్షిక వేతనంలో 6 శాతమే పన్ను కడుతున్నట్టు లెక్క. ₹20Lపై ₹2L (10%), ₹25Lపై ₹3.3L (13.2%) పన్నే కట్టాలి. అంతేగానీ సోషల్ మీడియాలో మొత్తుకున్నట్టు 33% చెల్లించరు. శ్లాబులను పట్టుకొని తికమకపడొద్దు.

News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌.. మాజీ మంత్రి బుగ్గన స్పందన

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ‘బడ్జెట్‌లో ఏపీ కంటే బిహార్‌కే ఎక్కువ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ సంతృప్తిని ఇవ్వలేదు. బిహార్‌ కంటే ఏపీకే ఎక్కువ కేటాయింపులు జరగాలి. ఏపీ పునర్ విభజనలో కూడా అన్యాయం జరిగింది.’ అని పేర్కొన్నారు.

News February 1, 2025

సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలి: బాపట్ల జేసీ

image

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ సభ్యత్వ నమోదు గురించి జిల్లా స్థాయి కమిటీ మీటింగ్ శనివారం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈ శ్రమ్ పోర్టల్‌లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు.