News February 1, 2025

నూతన డీజీపీని కలిసిన బాపట్ల ఎస్పీ

image

నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాను బాపట్ల ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను డీజీపీకి వివరించారు.

Similar News

News July 6, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి 1.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 67వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 879.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 180.42 TMCలుగా ఉంది. 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది.

News July 6, 2025

చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అచ్చంపేటలోని మున్ననూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు తొలి విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 3,371, అత్యల్పంగా నాగార్జున‌సాగర్‌లో 17 ఇళ్లు కేటాయించారు.

News July 6, 2025

రాయచోటిలో ఘోర ప్రమాదం

image

రాయచోటిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి-మదనపల్లె మార్గంలోని ఇస్తిమా మైదానానికి సమీపాన ఉన్న శ్రీనివాసపురం వద్ద లారీ, ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో మృతదేహం ఛిద్రమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.