News February 1, 2025
వరంగల్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
Similar News
News November 11, 2025
పెళ్లయిన 6 నెలలకే సూసైడ్.. వేధింపులే కారణమా?

ఇల్లందు (M) లచ్చగూడెం గ్రామానికి చెందిన 3 నెలల <<18250957>>గర్భిణీ అంజలి<<>> మృతికి అత్తింటి వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఏడాది మే14న పెళ్లైన అంజలిని, ఆమె భర్త సాయికుమార్ కట్నం సరిపోలేదంటూ వేధించేవాడని తెలిపారు. ఈ విషయంపై గతంలో పంచాయతీ కూడా జరిగింది. రెండు రోజుల క్రితం సాయికుమార్, అతని తల్లిదండ్రులు అంజలిని చిత్రహింసలకు గురిచేయడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని వారు తెలిపారు.
News November 11, 2025
డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.
News November 11, 2025
తిరుమల: ముగ్గురు పోలీస్ అధికారుల స్టేట్‌మెంట్ రికార్డు

పరకామణి చోరీ కేసులో సోమవారం ముగ్గురు పోలీసులను CID బృందం విచారణ చేపట్టింది. కేసులో ఉన్న మాజీ CI జగన్ మోహన్ రెడ్డి, SI లక్ష్మీపతి, విజిలెన్స్ అధికారి గిరిధర్‌ను విచారించారు. కేసు సెక్షన్లు ఏవీ, ఎందుకు పెట్టారు, అరెస్టు ఎందుకు చేయలేదు, రాజీ ఎలా చేశారు, లోక్ అదాలత్‌లో ఎవరు చెబితే పెట్టారనే ప్రశ్నలు వేసి వారి సమాధానాలను రికార్డు చేశారు.


