News February 1, 2025
వరంగల్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
Similar News
News January 4, 2026
కామారెడ్డి జిల్లాలో మళ్లీ పెరుగుతున్న చలి ప్రభావం

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. లచ్చపేట 13°C, గాంధారి 13.9, దోమకొండ 14, ఎల్పుగొండ 14.3, ఇసాయిపేట 14.5, భిక్కనూరు 14.7, జుక్కల్ 14.9°C ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2 రోజులుగా పొగమంచు అధికంగా ఏర్పడి, చలి తగ్గగా, తిరిగి చలి ప్రభావం ఎక్కువవుతుందని తెలిపారు.
News January 4, 2026
కురుపాం: చికిత్స పొందుతూ యువకుడు మృతి

కురుపాం(M) పి.లేవిడి గ్రామానికి చెందిన వి.అజిత్ కుమార్ (23) గత నాలుగు రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.స్థానికుల వివరాలు మేరకు..గత నెల 31న గుమ్మలక్ష్మీపురం(M)బొద్దిడి సమీపంలో గ్యాస్ వ్యాన్‌ను బైక్ ఢీకొని ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో అజిత్ కుమార్‌కు తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు.
News January 4, 2026
కూరగాయల పంట పెరిగింది: మాధవి

ఉద్యానశాఖ చేపట్టిన చర్యల వల్ల గతేడాది సీజన్ 767 ఎకరాలుగా ఉన్న కూరగాయల విస్తీర్ణం ఈ ఏడాదిలో 1,458 ఎకరాలకు పెరిగిందని జిల్లా ఉద్యానవన అధికారి మాధవి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కూరగాయల సాగు చేసే రైతులు 1,710 మంది వరకు ఉన్నారన్నారు. కూరగాయల సాగు కోసం మల్చింగ్ షీట్ వేసిన రైతులకు ఎకరానికి రూ.8వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.


