News February 1, 2025
వరంగల్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్
కరీంనగర్లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
Similar News
News February 2, 2025
వరంగల్: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష: కలెక్టర్
నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగంగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పొలిటికల్ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న వెలువడనున్నందున ఎన్నికల నిర్వహణకు పొలిటికల్ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు జరుగుతుందన్నారు.
News February 1, 2025
వరంగల్: రైల్వే స్టేషన్లో కుప్పకూలిన వృద్ధుడు
వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ఓ వృద్ధుడు కుప్పకూలాడు. వరంగల్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకునేందుకు వచ్చిన మంద నరసయ్య (74 ) రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద అనారోగ్యం కారణంగా కుప్పకులాడు. వెంటనే స్టేషన్ మాస్టర్ 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి చూసి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని శవపంచనామా అనంతరం కొడుకు ప్రకాశ్ అప్పగించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
News February 1, 2025
వరంగల్: ఆపరేషన్ స్మైల్ ద్వారా 161 చిన్నారులకు విముక్తి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా జనవరిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నారులకు విముక్తి కలిగించామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా తెలిపారు. వీరిలో 137 మంది బాలలు, 24 మంది బాలికలు ఉన్నారన్నారు. తనిఖీల్లో గుర్తించిన చిన్నారులను బాలల సంరక్షణ గృహానికి తరలించామని సీపీ తెలిపారు.