News February 1, 2025

HYD: WOW.. త్వరలో అద్భుతమైన పార్క్ ఓపెన్!

image

HYD నగరంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న హిమాయత్ సాగర్, కొత్వాల్ గూడ పార్క్ త్వరలో ఓపెన్ కానుంది. దాదాపుగా 1000 రకాల పక్షులతో పక్షిశాలను సైతం సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఎక్వేరియం, పిక్నిక్ పార్కు, రిసార్టులు, అడ్వెంచర్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు అందుబాటులో ఉంచారు.

Similar News

News November 14, 2025

HYD: BRSను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తున్నారా అని ఇటీవల KTR అన్నారని, కచ్చితంగా భావిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ఆధిక్యంపై ఆయన మాట్లాడారు. ప్రజాపాలన వైపు ప్రజలు ఉన్నారన్న దానికి ఇది నిదర్శనమన్నారు. BRSను ప్రజలు నమ్మడం లేదని, అది ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. అభివృద్ధికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, తాము బీసీ బిడ్డకు టికెట్ కేటాయించామన్నారు.

News November 14, 2025

45 వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్

image

ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. జూబ్లీహిల్స్‌లో తానే గెలవబోతున్నానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని ఆశించారు. 45 వేల మెజారిటీతో గెలుస్తున్నామని నవీన్ యాదవ్ తెలిపారు. అయితే, ఆయన ఆశించిన స్థాయిలోనే 4 రౌండ్లలో INC లీడ్‌లో ఉంది.

News November 14, 2025

HYD: 750 వాహనాలు సీజ్: ఆర్టీఏ అధికారులు

image

నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వాహనాలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రెండు రోజులుగా 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో 750 వాహనాలను సీజ్ చేశామని, ఓవర్ లోడ్ వాహనాలను క్వారీలు, రీచ్‌ల వద్దనే నియంత్రించేందుకు మైనింగ్ శాఖకు ఆర్టీఏ అధికారులు సిఫార్సు చేశారు.