News February 1, 2025
కరీంనగర్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

కరీంనగర్లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
Similar News
News January 21, 2026
నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. అరగంట ముందే గేట్స్ క్లోజ్

నేటి నుంచి JEE మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు, ఎల్లుండి, ఈ నెల 24, 28 తేదీల్లో పేపర్-1, 29న పేపర్-2 పరీక్ష జరగనుంది. రోజు ఉ.9-12 గం. వరకు షిఫ్ట్-1, మ.3-6 వరకు షిఫ్ట్-2లో CBT పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. ఎగ్జామ్కు అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 14 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది హాజరుకానున్నారు. ఫోన్లు, వాచులు, ఇయర్ ఫోన్లకు పర్మిషన్ లేదు.
News January 21, 2026
నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్-ఉష దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వాన్స్ ప్రకటించారు. ‘ఉష మా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతోంది. మా బాబు జులైలో పుట్టబోతున్నాడు. ఈ సంతోష సమయంలో మా ఫ్యామిలీ, దేశం కోసం కష్టపడుతున్న సిబ్బందికి, సేవలందిస్తున్న మిలిటరీ డాక్టర్లకు ధన్యవాదాలు’ అని తెలిపారు. లా స్కూల్లో వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ 2014లో పెళ్లిచేసుకున్నారు.
News January 21, 2026
ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.


