News February 1, 2025

HYD: WOW.. త్వరలో అద్భుతమైన పార్క్ ఓపెన్!

image

HYD నగరంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న హిమాయత్ సాగర్, కొత్వాల్ గూడ పార్క్ త్వరలో ఓపెన్ కానుంది. దాదాపుగా 1000 రకాల పక్షులతో పక్షిశాలను సైతం సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఎక్వేరియం, పిక్నిక్ పార్కు, రిసార్టులు, అడ్వెంచర్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు అందుబాటులో ఉంచారు.

Similar News

News February 1, 2025

RR: పకడ్బందీగా ఏర్పట్లు చేయాలి: కలెక్టర్

image

మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ..పరీక్షల నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

News February 1, 2025

గ్రేటర్ HYDలో గాలి నాణ్యత కేంద్రాలు ఉన్నవి అక్కడే!

image

గ్రేటర్ HYDలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు ఉన్న కేంద్రాల లిస్టును CPCB అధికారులు వెల్లడించారు. న్యూ మలక్పేట, నాచారం-TSIIC, సోమాజిగూడ, ఈసీఐఎల్- కాప్రా, కొంపల్లి, కోకాపేట, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్ నగర్, ఇక్రిశాట్, పటాన్ చెరు, జవహర్ జూపార్క్ మొత్తంగా ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎయిర్ పొల్యూషన్ చెక్ చేస్తున్నట్లు తెలిపారు.

News February 1, 2025

సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

image

సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి <<>>కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్‌కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.