News February 1, 2025

రేపు పెద్దగట్టు ఆలయం వద్ద దిష్టి పూజ

image

పెద్దగట్టు జాతర వద్ద ఆదివారం దిష్టి పూజ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దిష్టి పూజ నిర్వహిస్తారని పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య యాదవ్ తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

Similar News

News February 1, 2025

నల్గొండ: రాజకీయ పార్టీల నేతలతో సమావేశం

image

నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లో జిల్లాలోని రాజకీయ పార్టీ నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నారు. పోలింగ్ స్టేషన్‌ల ఖరారుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలు పై రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని రాజకీయ నేతలకు అధికారులు తెలిపారు.

News February 1, 2025

చెర్వుగట్టు ఆలయ స్థల పురాణం ఇదే!

image

చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.

News February 1, 2025

మిర్యాలగూడ: భూ తగాదాలతో యువకుడిపై హత్యాయత్నం..!

image

మిర్యాలగూడ కోర్టు ఎదుట దామరచర్ల మం. వీర్లపాలెంకి చెందిన అల్లం మహేశ్‌పై నలుగురు యువకులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. 30 ఏళ్ల క్రితం మంద మహేశ్, శేఖర్ కుటుంబ సభ్యుల వద్ద అల్లం మహేశ్ కుటుంబ సభ్యులు వీర్లపాలెంలోని భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భూమి విషయంలోనే మహేశ్‌పై మంద కుటుంబ సభ్యులు దాడి చేశారన్నారు.