News February 1, 2025

కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు

image

☞ వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1.71లక్షల కోట్లు
☞ విద్య- రూ.1.28 లక్షల కోట్లు
☞ ఆరోగ్యం-రూ.98,311 కోట్లు
☞ పట్టణాభివృద్ధి-రూ.96,777 కోట్లు
☞ ఐటీ, టెలికం-రూ.95,298 కోట్లు
☞ విద్యుత్- రూ.81,174 కోట్లు
☞ వాణిజ్యం, పరిశ్రమలు- రూ.65,553 కోట్లు
☞ సామాజిక సంక్షేమం-రూ.60,052 కోట్లు

Similar News

News March 7, 2025

త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్: మంత్రి

image

AP: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. BC, EWS అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి వివరించారు.

News March 6, 2025

రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలని హుండీలో చీటీలు

image

తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని దర్గాను తొలగించాలని కొద్ది రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేశారు. ఆలయ సిబ్బంది వీటిని గమనించి తొలగించారు. కాగా, ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి.

News March 6, 2025

నోటిఫికేషన్ విడుదల

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో BSFలో 24, CRPFలో 204, CISFలో 92, ITBPలో 4, SSBలో 33 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
సైట్: upsc.gov.in/

error: Content is protected !!