News February 1, 2025
SKLM: రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

రథసప్తమి ఏర్పాట్లను SKLM జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం పరిశీలించారు. సూర్య నమస్కారాలు నిర్వహించబోయే 80 అడుగుల రోడ్డు వద్ద ఏర్పాట్లు, అక్కడే పార్కింగ్ ఏర్పాట్లు పై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఎస్పీ వివేకానందతో చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. నగరంలో మిల్లు జంక్షన్, పాలకొండ రోడ్డులో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.
Similar News
News March 10, 2026
శ్రీకాకుళం: సామాన్యులపైన యుద్ధం ప్రభావం!

ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రభావం శ్రీకాకుళం జిల్లా ప్రజలపైన పడుతుంది. ప్రభుత్వం ఒకేసారి వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.100 పెంచారు. జిల్లాలో 6,95,278 కనెక్షన్లు ఉన్నాయని జిల్లా పౌరసరపరా శాఖ జి.సూర్యప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం వంట గ్యాస్ ధర జిల్లాలో రూ.879.50, వాణిజ్య గ్యాస్ ధర రూ.939.50 ఉంది. మరోపక్క గ్యాస్ డెలివరీ సమయం 25 రోజులకు పెంచారు.
News March 10, 2026
SKLM: పశువుల అక్రమ రవాణ.. ఇద్దరిపై కేసు నమోదు

లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని అడ్డుకున్నామని ఎస్సై అప్పలసూరి తెలిపారు. సోమవారం పశువుల వాహనం వెళుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్నామని ఆయన వివరించారు. బుడుమూరు వద్ద తనిఖీ చేయగా కోటబొమ్మాళి మండలం నారాయణ వలస సంత నుంచి ఆలమండకు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. కరగాన రాజు, కె.వెంకట్‌లపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.
News March 10, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్తీక్ మృతి

ఎచ్చెర్ల ప్రధాన రహదారిలోని సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనం <<19333513>>బోల్తా<<>> ఘటనలో అరసవిల్లి కార్తీక్ (18) గాయపడిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు మధు చరణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా రహదారిపై మొక్కజొన్న పంట టార్పాలిన్ కప్పి ఉండడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అతడిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.


