News February 1, 2025

ధర్పల్లి: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

image

దుబ్బాక గ్రామానికి చెందిన బొల్లారం సాయిలు అనే వ్యక్తి యూరియా కోసం ట్రాక్టర్ పై ధర్పల్లికి వెళ్తూ గ్రామ శివారులోని పసుపు పరిశోధన కేంద్రం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సాయిలు(52) అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్పల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 6, 2025

NZB: 420 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 420 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,343 మంది విద్యార్థులకు 15,923 మంది పరీక్షలకు (97.4 శాతం) హాజరయ్యారని తెలిపారు. ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బీ సెంటర్‌లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా పట్టుకున్నారన్నారు.

News March 6, 2025

NZB: ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

image

డిచ్పల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి, పరీక్షల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా గట్టి నిఘాతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు.

News March 6, 2025

NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

error: Content is protected !!