News February 1, 2025
బడ్జెట్‌లో తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా..?: హరీశ్ రావు

2025-26 బడ్జెట్‌ను కేంద్రం తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నదే తప్ప దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని హరీష్ రావు ‘X’లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పదేపదే వల్లే వేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించి లేని రాష్ట్రాలకు వివక్ష చూపడం సరికాదన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా..? అని నిలదీశారు.
Similar News
News November 8, 2025
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న పవన్

జిల్లా పర్యటనలో భాగంగా Dy.CM పవన్ కళ్యాణ్ తిరుపతి మంగళంలోని ఎర్రచందనం నిల్వ ఉన్న గోడౌన్‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయన అక్కడ ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఎన్ని టన్నుల దుంగలు ఉన్నాయి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News November 8, 2025
పెద్దకడబూరులో హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు

పెద్దకడబూరులో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టేళ్ల పందాలను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, మల్లికార్జున ప్రారంభించారు. గ్రామీణ క్రీడలలో భాగమే పొట్టేళ్ల పందేలని గుర్తు చేశారు. ఇందులో గెలుపొందిన పొట్టేళ్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నల్ల, నట్టు పొట్టేళ్లకు వేరు వేరుగా పోటీలు నిర్వహించారు.
News November 8, 2025
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు లేదు: HMRL

HYD మెట్రో ఛార్జీల పెంపు అని వస్తోన్న వార్తలపై HMRL క్లారిటీ ఇచ్చింది. తక్షణమే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మెట్రో సేవలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఛార్జీల నిర్ధారణ కమిటీ సిఫారసుల ఆధారంగా మే 24, 2025 నుంచి ఛార్జీల సవరణ అమలు చేశామని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు అవాస్తవమని FactCheck_Telangana ధ్రువీకరించింది.
SHARE IT


