News February 1, 2025

తర్వాతి మ్యాచ్‌లో షమీని ఆడిస్తాం: మోర్కెల్

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా రేపు జరిగే ఆఖరి మ్యాచ్‌లో షమీని ఆడించనున్నట్లు భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపారు. ‘షమీ చాలా బాగా ఆడుతున్నారు. వార్మప్ గేమ్స్‌లో శరవేగంగా బౌలింగ్ చేస్తున్నారు. వచ్చే మ్యాచ్‌కి ఆయన్ను ఆడిస్తాం. ఆ అనుభవం యువ ఆటగాళ్లకు కీలకం’ అని పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ షమీకి భారత జట్టులో వరుస అవకాశాలివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 7, 2025

US సుప్రీంకోర్టులో తహవూర్ రాణాకు షాక్

image

26/11 ముంబై ఉగ్ర దాడి కేసు నిందితుడు తహవూర్ రాణాకు యూఎస్ సుప్రీంకోర్టు షాకిచ్చింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. భారత్‌కు అప్పగిస్తే తనను చిత్రహింసలు పెడతారని అతడు పేర్కొన్నాడు. కాగా రాణాను భారత్‌కు అప్పగిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News March 7, 2025

GET READY: నేడు ఉదయం 11 గంటలకు..

image

ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటికే క్రికెట్ ఫీవర్ మొదలైంది. హైదరాబాద్‌లో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని SRH ప్రకటించింది. 23న రాజస్థాన్, 27న లక్నోతో ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News March 7, 2025

సైకో అంటారు.. మేం తిరిగి అంటే ఏడుస్తారు: తాటిపర్తి

image

AP: కూటమి నేతలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైరయ్యారు. ‘జగన్‌ను మీరు సైకో, శాడిస్ట్, క్రిమినల్, ఉగ్రవాది, తీవ్రవాది అనొచ్చు.. మిమ్మల్ని కార్పొరేటర్‌కు ఎక్కువ అంటే ఏడుస్తారు. తిరిగి బూతులు తిడతారు. ఇదేం చోద్యం?’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని జగన్ సెటైర్ వేయడంతో కూటమి నేతలు రగిలిపోతున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!