News February 1, 2025

అనకాపల్లి: ఎన్నికలు ముగిసేవరకు పరిష్కార వేదిక నిలుపుదల

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిలుపు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. మార్చి 8వ తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుందన్నారు. ఆ తర్వాత నుంచి ప్రజావేదిక కొనసాగిస్తామని ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News November 8, 2025

శ్రీవారి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందంటే..?

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తొలి సేవ ‘సుప్రభాతం’. ఇది ఉ.3 గంటలకు జరుగుతుంది. స్వామివారిని మేల్కొలిపే దివ్య ఘట్టమిది. పవిత్ర మంత్రాలు, శ్లోకాలు, మధుర నాదాలతో అర్చకులు స్వామివారిని నిదురలేపి, నిత్య కైంకర్యాలకు ఆహ్వానిస్తారు. ఈ సేవతోనే రోజు ప్రారంభమవుతుంది. ఈ సేవకు ఎంపికైన భక్తులకు స్వామివారిని <<17956589>>అతి దగ్గరి నుంచి<<>>(10Ft) దర్శించుకునే మహాభాగ్యం లభిస్తుంది. ☞ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 8, 2025

M.T.U 1121.. పచ్చి బియ్యానికి అనుకూలం

image

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ప్రాముఖ్యత కలిగి రైతులచే ఎక్కువగా సాగు చేయబడుతున్న రకం M.T.U 1121( శ్రీ ధృతి). దీని పంట కాలం 120-125 రోజులు. గింజ మధ్యస్త సన్నంగా ఉంటుంది. ఇది చేనుపై పడిపోకుండా అగ్గి తెగులును, దోమ పోటును తట్టుకుంటుంది. మిషన్ కోతకు కూడా అనుకూలమైన రకం. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. పచ్చి బియ్యానికి ఈ రకం అనుకూలం. దిగుబడి ఎకరాకు సుమారు 3.5 టన్నులుగా ఉంటుంది.

News November 8, 2025

కరీంనగర్: రైతుల చూపులు.. ఆకాశం వైపు..!

image

ఉమ్మడి KNR జిల్లాలో వర్షాల మధ్య రైతుల ఆశలు తడిసి ముద్దవుతున్నాయి. చెమటోడ్చి పండించిన బంగారు ధాన్యం ఇప్పుడు ఆకాశం దయ మీద ఆధారపడి ఉంది. ఎండబెట్టిన క్రమంలో కురిసిన చినుకులు రైతు హృదయాన్ని తడుపుతున్నాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఆలస్యమవడంతో, పొలాల పక్కన పంటను ఎండబెట్టిన ప్రయత్నంలో రైతులు నిస్సహాయంగా మారారు. కష్టానికి కడుపు నిండే ఫలితం దక్కుతుందా లేదా అనే ఆందోళనలో రైతుల చూపులు ఆకాశం వైపు చూస్తున్నాయి.