News February 1, 2025
ముస్తాబాద్: గూడు లేక.. రాత్రంతా అంబులెన్సులోనే మృతదేహం

ముస్తాబాద్‌కి చెందిన బిట్ల సంతోష్ (48) అనే నేత కార్మికుడు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి భార్య శారద ముగ్గురు పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు అభ్యర్థించారు.
Similar News
News March 7, 2025
చిత్తూరు జిల్లాలో పట్టపగలే పంజా విసురుతున్న దొంగలు

చిత్తూరు జిల్లాలో పట్టపగలే దొంగలు పంజా విసురుతున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా అందినకాడికి దోచుకుంటూ ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నారు. మంగళవారం కుప్పంలో ఓ ఇంటిపై దాడి చేసి బంగారం, నగదు అపహరించిన దొంగలు.. వీకోటలోనూ చేతివాటం చూపించి పోలీసులకు సవాల్ విసిరారు. దొంగల ధాటికి బయటకి వెళ్లాలంటే వణుకుతున్న ప్రజలు.. త్వరగా వారిని పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
News March 7, 2025
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదాలు.. నలుగురు మృతి

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిన్న జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. చెన్నైలో చదువుకుంటున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరి మరణంతో నెల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. అదేవిధంగా గూడూరు మండలం తిప్పవరపాడు క్రాస్ వద్ద స్కూటీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలు మున్నెయ్య, జ్యోతి మృతి చెందారు.
News March 7, 2025
US సుప్రీంకోర్టులో తహవూర్ రాణాకు షాక్

26/11 ముంబై ఉగ్ర దాడి కేసు నిందితుడు తహవూర్ రాణాకు యూఎస్ సుప్రీంకోర్టు షాకిచ్చింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. భారత్‌కు అప్పగిస్తే తనను చిత్రహింసలు పెడతారని అతడు పేర్కొన్నాడు. కాగా రాణాను భారత్‌కు అప్పగిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.