News February 1, 2025
MBNR: రిజర్వాయర్‌లో పడి చిన్నారులు మృతి

జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2026
పత్తి విత్తనాల కొనుగోలు – రైతులకు సూచనలు

TG: పత్తి విత్తనాలను తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన లైసెన్స్ గల అధీకృత విత్తన డీలర్ల వద్ద మాత్రమే రైతులు కొనుగోలు చేసి, బిల్లు తప్పక అడిగి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ఎక్కడైనా బిల్లు లేకుండా నకిలీ పత్తి విత్తనాలు, HT పత్తి, లూజు విత్తనాలను కలిగి ఉన్నా, అమ్ముతున్నా ఆ సమాచారాన్ని సంబంధిత మండల వ్యవసాయ అధికారికి లేదా 18005995779 (టోల్ ఫ్రీ) నంబర్‌కు కాల్ చేసి చెప్పండి.
News February 24, 2026
కళ్లు చెదిరే ధర.. గజం లక్షన్నర పైనే..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు బహిరంగ వేలంలో రికార్డు ధరలు పలికాయి. గచ్చిబౌలిలో చ.గజం ఏకంగా ₹1.76 లక్షలు, కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ₹1.64 లక్షల ధర పలికినట్లు హౌసింగ్ బోర్డు MD VC గౌతమ్ తెలిపారు. గచ్చిబౌలి, బాచుపల్లి వంటి 14 ప్రాంతాల్లోని ప్లాట్ల కోసం నిర్వహించిన వేలంలో 50 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. సోమవారం నాటి విక్రయాల ద్వారా మొత్తంగా ₹34.27 కోట్ల ఆదాయం సమకూరింది.
News February 24, 2026
JGL: మావోయిస్టు మాజీ చీఫ్ గణపతి ఎక్కుడ..?

మావోయిస్టు మాజీ చీఫ్ ముప్పల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారనేది ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. మావోయిస్టు పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన నాయకుడు, ఎందరికో ఆదర్శంగా ఉంటూ ఉద్యమాన్ని నడిపించిన జగిత్యాల జిల్లా బీర్పూర్‌కు చెందిన గణపతి 70 ఏళ్లు దాటి వయస్సు పైబడటంతో మిగతా వారికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారం లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


