News February 1, 2025

బెల్లంపల్లి: అడవి పందిని హతమార్చిన పెద్దపులి

image

2 రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గ దేవాలయం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం మండల ప్రజలను హడలెత్తిస్తోంది. బుగ్గకు వెళ్లే రహదారి పక్కన తోకల మల్లేశ్‌కు చెందిన పత్తి చేనులో అడవి పందిపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పెద్దపులి దాడి విషయాన్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.

Similar News

News March 1, 2026

VKB: ఇంటర్ అడ్మిషన్ల పెంపుపై అధికారుల దృష్టి

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ మేరకు జూన్ 1 నుంచి విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలతో పాటుగా వివిధ రకాల వస్తువులు ఉండే ఒక కిట్టును అందజేయనుంది. ఇప్పటికే అధికారులు ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఆమోదిస్తే వికారాబాద్ జిల్లాలోని 13 జూనియర్ కళాశాలల్లోని సుమారు 3000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

News March 1, 2026

HYD: Way2Newsలో కథనం.. అధికారుల్లో చలనం

image

MMC ఘట్‌కేసర్‌ సర్కిల్ ముత్వెల్లిగూడలో నీటి లీకేజీపై Way2News కథనానికి అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు. ‘<<19260987>>నమ్మండి.. ఇది రోడ్డే..!<<>>’ శీర్షికన శనివారం పబ్లిష్ అయిన కథనంతో HMWSSB మల్కాజిగిరి ED పంకజ, CGM (E) సంతోష్ సదరు ప్రాంతాన్ని సందర్శించారు. 200mm డయా పైపు నీటి లీకేజీ సమస్యను పరిష్కరించారు. స్పందించి సమస్య తీర్చిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

News March 1, 2026

అనకాపల్లి: రేపటి నుంచి సంస్కృతం పేపర్ మూల్యాంకనం

image

ఇంటర్మీడియట్ సంస్కృతం పేపర్ మూల్యాంకనం ఈనెల 2వ తేదీ నుంచి అనకాపల్లి ఆదినారాయణ మహిళ కళాశాలలో జరుగుతుందని ఇంటర్ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎం.వినోద్ బాబు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే మూల్యాంకనంలో వాల్యూషన్ ఆర్డర్ పొందిన అందరూ పాల్గొనాలన్నారు. రేపు మధ్యాహ్నం జిల్లా ఇంటర్ అధికారికి రిపోర్టు చేయాలన్నారు.