News February 1, 2025
నవీపేట్: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
నవీపేట్ మండలం ఎంచ గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వినయ్ కుమార్ వివరాల ప్రకారం.. రావుల పెద్దయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. నవీపేట్ సుభాష్ నగర్‌కి చెందిన రెండో భార్య సవిత ప్రతిరోజూ గొడవ పడుతుండేది. ఆమె బంధువులు వచ్చి బెదిరించడంతో గొడవ ఏర్పడింది. దీంతో పెద్దయ్య ఆవేశంలో శుక్రవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 1, 2025
ఆర్మూర్: కేంద్ర మంత్రిని కలిసిన పల్లె గంగారెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నేషనల్ టర్మరిక్ బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. పసుపు బోర్డు ఛైర్మన్ పదవి చేపట్టడానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. పసుపు రైతుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.
News February 1, 2025
NZB:14.5 తులాల బంగారం చోరీ
సిరికొండ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య ఇంట్లో 14.5 తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని సిరికొండ ఏఎస్ఐ బాల్ సింగ్ తెలిపారు. ఏఎస్ఐ వివరాల ప్రకారం.. సత్తయ్య శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాను చూడగా బంగారం పోయిందని బాధితుడు వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
News February 1, 2025
NZB: ఫేక్ యాప్‌తో మోసం.. ఇద్దరి అరెస్ట్
ఫేక్ యాప్‌లో ఆఫర్ల పేరిట అమాయకులను మోసం చేస్తున్న షేక్ అమిర్, సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. MGI యాప్ పేరుతో దాదాపుగా 12 మంది బాధితుల నుంచి రూ.2.40లక్షల నగదును కాజేశారని పేర్కొన్నారు. ఇలాంటి యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీసు అధికారులను ACP అభినందించారు.