News February 1, 2025

RR: పకడ్బందీగా ఏర్పట్లు చేయాలి: కలెక్టర్

image

మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ..పరీక్షల నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News March 3, 2026

రంగారెడ్డి జిల్లాలో ప్రధాన ఆలయాలు మూసివేత

image

పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఫరూఖ్‌నగర్ మండంలోని ఉత్తరరామలింగేశ్వ రస్వామి, ఎలికట్ట అంబాభవానీ ఆలయాలు, చేవెళ్లలోని వేంకటేశ్వర ఆలయం, కడ్తాల్ మం.లోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయం, నర్కుడలోని అమ్మపల్లి ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం శుద్ధి చేసి తెరుస్తామన్నారు.

News March 2, 2026

RR: ప్రజావాణికి 51 ఫిర్యాదులు: కలెక్టర్

image

రంగారెడ్డిలో కలక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి 51 ఫిర్యాదులు అందాయని, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News March 1, 2026

RR: డ్వాక్రా మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

image

హెల్త్ మిషన్-100లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని డ్వాక్రా మహిళలందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయబోతున్నామని DMHO డా.లలితాదేవి అన్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 2,25,020 మంది మహిళా సభ్యుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నామని ఆమె పేర్కొన్నారు.