News February 1, 2025
వికారాబాద్: గ్రంథాలయాన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తాం: కలెక్టర్

ఆధునిక హంగులతో నూతన గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుకుందామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ పట్టణ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. వారికి కావలసిన అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. యువత అభ్యర్థన మేరకు గ్రంథాలయంలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Similar News
News November 3, 2025
యాదాద్రి: కార్తీక దీపోత్సవంలో కలెక్టర్ దంపతులు

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సాయంత్రం దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు పాల్గొని దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News November 3, 2025
వరంగల్ పరిధిలో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 మంది మద్యం తాగి వాహనాలు నడపగా, మరో నలుగురు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డారని ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. ఈ కేసులపై కోర్టు జరిమానాలు విధించినట్లు, మద్యం సేవించి వాహనం నడపడం చట్టారీత్యా నేరమని హెచ్చరించారు.
News November 3, 2025
దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి: భూపాలపల్లి కలెక్టర్

జిల్లాలో ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి 44 ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


