News February 1, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్‌లతో సీఈఓ వీడియో సమావేశం

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. కలెక్టర్ తేజస్, అ.కలెక్టర్ పి. రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 7, 2025
ద్రవిడులు ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరు: స్టాలిన్

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు CM స్టాలిన్ విరుచుకుపడ్డారు. ద్రవిడులు జాతికి దిశానిర్దేశం చేస్తారు తప్ప ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరని అన్నారు. ‘కేంద్ర విద్యామంత్రి మా రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపనేదే లేని యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. చరిత్ర స్పష్టంగా ఉంది. తమిళనాడుపై హిందీని రుద్దడానికి ట్రై చేసినవారు ఓడిపోయారు లేదా తర్వాత మాతో కలిసిపోయారు’ అని గుర్తుచేశారు.
News March 7, 2025
ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. క్షతగాత్రుడు ఇల్లంద గ్రామానికి చెందిన నిమ్మనబోయిన రమేశ్(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2025
‘తులం బంగారం’ హామీ అమలుపై మంత్రి క్లారిటీ

TG: ‘కళ్యాణ లక్ష్మీ’ పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించడంతోనే దీనిని అమలు చేయడం ఆలస్యమవుతోందని తెలిపారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే పలు హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు.