News February 1, 2025
సంగారెడ్డి జిల్లాలో 57 మంది బాల కార్మికుల విముక్తి

సంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ స్మైల్ -XLలో 57 మంది బాల కార్మికులను విముక్తి కల్పించినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అని, బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల కార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా 112కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్ టీంను అభినందించారు.
Similar News
News February 28, 2026
కాకినాడ విషాదం.. ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం

AP: కాకినాడ(D) వేట్లపాలెంలో జరిగిన భారీ <<19263594>>పేలుడు<<>> ఘటనలో 20 మంది మృతిచెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వేట్లపాలెంలో బాధితులను పరామర్శించిన అనంతరం తెలిపారు.
News February 28, 2026
భద్రాచలం: నవమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి!

భద్రాచలంలో మార్చి 27, 28 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
News February 28, 2026
జగిత్యాల : 36 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. 36 ఏళ్లపాటు పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించిన ఏఎస్ఐ బిక్షపతి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడుతూ, శాఖకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.


