News February 1, 2025

SRD: గురుకుల ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ప్రభుత్వంలో వివిధ గురుకులాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గాను ఈనెల  6 వరకు గడువు పొడిగించినట్లు TGSWREIS అధికారులు శనివారం తెలిపారు. గురుకులాల్లో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలలో ప్రవేశం కోసం ఫిబ్రవరి 1 చివరి తేదీగా ఉండగా మరో 5 రోజులు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News January 12, 2026

నేడే PSLV-C62 ప్రయోగం

image

AP: ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి ISRO సిద్ధమైంది. తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్‌ సెంటర్‌ నుంచి PSLV-C62 రాకెట్ ఈ రోజు ఉదయం 10.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1ను రోదసిలోకి పంపనున్నారు. దీనికి తోడుగా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.

News January 12, 2026

విజయవాడలో అర్ధరాత్రి హత్య (అప్డేట్)

image

విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లో ఆదివారం రాత్రి అత్తను అల్లుడు హత్య చేసిన విషయం తెలిసిందే. అత్తపై ఉన్న ఆగ్రహంతో అల్లుడు దారుణంగా హత్య చేశాడు. అల్లుడు నాగసాయి కత్తితో అత్త దుర్గాను విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని అజిత్ సింగ్ నగర్ పోలీసులు తెలిపారు.

News January 12, 2026

MDK: పోలీసుల అప్రమత్తతతో తప్పిన విషాద ఘటన

image

ఏడుపాయల వనదుర్గామాత ఆలయం సమీపంలోని ఘనపూర్ ఆనకట్ట వద్ద కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్యను QRT-1 టీమ్ ప్రాణాలకు తెగించి కాపాడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న QRT-1 సిబ్బంది ఏఆర్‌ ఎస్‌ఐలు శ్రీనివాస్, సాయిలు తదితరులు నది ప్రవాహంలోకి వెళ్లి తాడు సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారి ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసించారు.