News February 1, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించుటకు కలెక్టరేట్ కు రావద్దని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News February 2, 2025
ASF: భారీగా కలప స్వాధీనం.. ఐదుగురి రిమాండ్
మండలంలోని ఆడా గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు అనుమానాస్పదంగా వెళుతున్న కారును ఆపి తనిఖీ చేయగా కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రూ.18 వేల విలువగల 4 టేకు దుంగలను జప్తుచేసినట్లు ఆసిఫాబాద్ FRO గోవింద్ సింగ్ సర్దార్, జోడేఘాట్ FRO జ్ఞానేశ్వర్ తెలిపారు. ఐదుగురుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
News February 2, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 2, 2025
3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్
2025-26లో 2వేల జనరల్ కోచ్‌ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. మూడేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.