News February 1, 2025
మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. మండలస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
Similar News
News February 2, 2025
MNCL: MLC ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి:SEO
శాసనమండలి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తదితరులు పాల్గొన్నారు.
News February 2, 2025
నిర్మల్: ‘వివాహితతో రాసలీలలు.. సీసీ సస్పెండ్’
ఇటీవల నిర్మల్ పట్టణంలో కలెక్టర్ సీసీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రాకేష్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విధుల నుంచి తొలగించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓ వివాహితతో రాసలీలలు నిర్వహిస్తుండగా పట్టుపడడంతో విచారణ చేపట్టామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
News February 2, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!
తాత్పర్యం: అడిగిన జీతం ఇవ్వని గర్వంతో కూడిన యజమాని వద్ద ఉండటం కంటే వేగంగా పోయే ఎద్దులను నాగలికి కట్టుకుని వ్యవసాయం చేయడం మంచిది.