News February 1, 2025

సిరిసిల్ల: పట్టభద్రుల ఓటర్లు ఎంతమందంటే..!

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 28 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 22 వేల 473 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించి 13 మండలాల పరిధిలో 928 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారుల వద్ద 149 పట్టభద్రులు, 40 ఉపాధ్యాయుల ఓటర్ నమోదు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిశీలించి సకాలంలో డిస్పోస్ చేయడం జరుగుతుందన్నారు.

Similar News

News March 14, 2025

రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.

News March 14, 2025

మీరు గొప్పవారు సర్..

image

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ టీచర్ బాల్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైనా పాఠాలు చెప్పడం మానట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రోజూ 15 KM సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేస్తున్నారు.

News March 14, 2025

మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

image

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.

error: Content is protected !!