News February 1, 2025

సిరిసిల్ల: కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల అధికారి

image

శాసనమండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించారు.

Similar News

News January 2, 2026

94 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలోని 141 గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు రాజముద్రతో కూడిన 94,090 నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. పాత భూహక్కు పత్రాల స్థానంలో ఇవి అందజేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లెలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు.

News January 2, 2026

నర్సాపూర్ బీవీఆర్ఐటీలో టెట్ పరీక్షా కేంద్రం

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

News January 2, 2026

వినుత హత్యకు MLA సుధీర్ డైరెక్షన్‌లో ప్లాన్: YCP

image

రాయుడు హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. చెన్నై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వినుత దంపతుల హత్యకు శ్రీకాళహస్తి MLA సుధీర్ రెడ్డి డైరెక్షన్‌లో TDP కార్యకర్త సుజిత్ రెడ్డితో కలిసి రాయుడు ప్లాన్ చేశాడని YCP ‘X’ వేదికగా ఆరోపించింది. ఇందు కోసం రూ.30 లక్షల డీల్‌ జరిగిందని, జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్ సోదరులు సహకరించారని రాసుకొచ్చింది. ఇప్పటికే సుధీర్‌కు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.