News February 1, 2025
సిరిసిల్ల: పరిశీలనకు స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

నీటి సరఫరా పరిశీలనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా జిల్లాలోని అన్ని గ్రామాలలో నీటి సరఫరాను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని స్పష్టం చేశారు.
Similar News
News September 16, 2025
జగిత్యాల: యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లకు ప్రోసీడింగ్‌లు అందజేత

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రోసీడింగ్‌లను అందజేశారు. ఇటీవల జగిత్యాల పట్టణం, పలు మండలాలకు కొత్తగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి ఆయన ఈ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
News September 16, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

కెపాసిటీ బిల్డింగ్ పై ఉపాధ్యాయులకు ఈనెల 17 నుంచి 20 వరకు డివిజన్ల వారిగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 17న ఖేడ్ 18న జహీరాబాద్, 19న సంగారెడ్డి, 20న పటాన్ చెరు డివిజన్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని సూచించారు.
News September 16, 2025
KTRతో సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా BRS నేతలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన BRS ముఖ్య నేతలు తెలిపారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన BRS సన్నాహక సమావేశం హైదరాబాదులో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన MLCలు పోచంపల్లి శ్రీనివాస్, తక్కలపల్లి రవీందర్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.