News February 1, 2025
డీజీపీని కలిసిన శ్రీకాకుళం ఎస్పీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శాంతిభద్రతలకు తీసుకున్న చర్యలను ఎస్పీ డీజీపీకి తెలియజేశారు.
Similar News
News March 7, 2025
కవిటి: ఇరాక్‌లో వలస కూలీ మృతి

విదేశాలకు కూలీ పనికి వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కవిటి మండలంలో జరిగింది. మండలంలోని ఆర్ బెలాగానికి చెందిన భుజంగరావు(43) ఇరాక్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆయన మృతిచెందడంతో తోటి కూలీలు ఫోన్ ద్వారా కుటుంబీకులకు చెప్పారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు మృతదేహన్ని దేశానికి రప్పించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే అశోక్ బాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు.
News March 7, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 385 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పి.దుర్గారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 19,149 మంది విద్యార్థులకు గాను 18,763 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. కాగా జిల్లాలోని పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి మాథ్స్ 2A పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడినట్లు ఆయన తెలిపారు.
News March 7, 2025
శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. శ్రీకాకుళం వాసులు ఎక్కువగా విశాఖ, విజయనగరం జిల్లాలకు వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, విజయనగరం వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.