News February 1, 2025

సంతనూతలపాడు: మహిళలకు ఉచిత కంప్యూటర్ కోర్స్ 

image

సంతనూతలపాడు మండలం ఏండ్లూర్ వద్ద మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ కోర్స్ శిక్షణ తరగతులు ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జే.రవితేజ యాదవ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15 నుంచి 45 సంవత్సరాలు లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  

Similar News

News October 31, 2025

ఒంగోలులో కారు ఢీకొని వ్యక్తి మృతి

image

ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కర్నాటి వెంకటసుబ్బారెడ్డిగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన కోణపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 31, 2025

ప్రకాశం జిల్లాలో నేడు పాఠశాలలు పునః ప్రారంభం

image

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వరుసగా 4 రోజులు తుఫాను సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఈ దశలో విద్యార్థుల భద్రతకోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.

News October 31, 2025

ప్రకాశం: ‘ఆక్వా రైతుల కంటతడి’

image

ప్రకాశం జిల్లా తీర ప్రాంతాన్ని నమ్ముకుని వేలమంది ఆక్వా రైతులు జీవిస్తున్నారు. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పపాడు మండలాల్లో ఆక్వా సాగు చేసిన రైతులు మొంథా తుఫాను దాటికి దెబ్బతిన్నారు. అదిక వర్షాలతో వల్ల కరెంట్ కోతలతోపాటు, చెరువుల్లో ఉప్పు నీటిశాతం తగ్గడంతో రొయ్యలు సరిగా మేత తినక డల్లయ్యాయి. తుఫానుకు ముందే అమెరికా సుంకాలతో ఆక్వా రైతులు కుదేలు కాగా మొంథా తుఫాన్ మరింత చిక్కులు తెచ్చింది.