News February 1, 2025

బడ్జెట్లో ఖమ్మంకు తీవ్ర అన్యాయం: సీపీఎం

image

ఖమ్మం: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, బిహార్ ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని ఆరోపించారు. జిల్లాకు నిధుల కేటాయింపుపై అన్యాయం చేశారని, దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 22, 2026

ఖమ్మం: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు

image

ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడిగా హెచ్చు వెంకటేశ్వరరావును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న, జాతీయ ఉపాధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు ప్రకటించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ఈయన ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ 28 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడారన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల హక్కుల కోసం పోరాడుతూ సంఘాన్ని ముందుండి నడిపించాలని కోరారు.

News January 22, 2026

ఖమ్మం: గ్రామ పారిశుద్ధ్యం, రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

ప్రజలకు సత్వర న్యాయం అందేలా అధికారులు మెరుగైన సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, ఎంపీడీవోలతో గ్రామ పారిశుద్ధ్యం, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News January 22, 2026

ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఓటీపీఎస్ (ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్) ద్వారా ఇసుకను పూర్తి పారదర్శకంగా సరఫరా చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, యాప్ లాంచ్ తర్వాత మాన్యువల్ పంపిణీ నిలిపివేయాలని ఆదేశించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్లకు, గృహ అవసరాలకు ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు.