News March 19, 2024

తాంసి: వార్డెన్‌ సస్పెండ్.. సిబ్బందికి షోకాజ్ నోటీసులు

image

తాంసి ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఎటువంటి అనుమతి లేకుండా గైర్హాజరు అవుతున్నట్లు ఆమె గుర్తించారు. పరీక్షల సమయంలో వార్డెన్ గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన ఆమె వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేశారు. అదేవిధంగా విధులకు గైర్హాజరు అవుతున్న బోధనేతర సిబ్బంది విజయ్, మహేందర్‌కు షోకాజ్ నోటీసులు అందజేశారు.

Similar News

News March 4, 2026

ADB కలెక్టర్ క్యాంపు ఆఫీసులో హోలీ వేడుకలు

image

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్ ఈడి మనోహర్, సంక్షేమ అధికారి మిల్కా, డిపిఓ రమేష్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పిడి రాజు ఉన్నారు.

News March 4, 2026

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రణాళికపై సమీక్ష

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో పీఓ యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ లతో కలిసి ఆయన ఈ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

News March 4, 2026

ADB: ఇంటి వద్దకే భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు

image

శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలోని భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.