News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌‌లో కొత్తగూడెం ప్రజలకు నిరాశే: సీపీఐ

image

కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగకపోవడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే.షాబీర్ పాషా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వ్యవసాయ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. రైతులను, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ధ్వజమెత్తారు.

Similar News

News February 25, 2026

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

TG: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణ వ్యాప్తంగా 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సెంటర్‌కు స్టూడెంట్స్ గంట ముందే చేరుకోవాలి. అయితే పరీక్ష స్టార్ట్ అయిన ఐదు నిమిషాల వరకు లోపలికి అనుమతించనున్నారు. సెంటర్లను CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.

News February 25, 2026

కంచె వేసినదే కమతము

image

పంట పండించే భూమికి (కమతము) రక్షణగా కంచె ఉంటే ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కంచె లేకపోతే పశువులు మేసేయడం లేదా ఇతరులు పాడుచేసే అవకాశం ఉండటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అంటే, రక్షణ లేని ఆస్తి ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. మనం జీవితంలో కూడా ఎంత సంపాదించినా, దానికి పొదుపు లేదా క్రమశిక్షణ అనే కంచె లేకపోతే ఆ సంపాదన హరించుకుపోతుందని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 25, 2026

మంత్ర పఠనం వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు

image

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మంత్ర పఠనం ఓ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంత్రాలను క్రమం తప్పకుండా పఠిస్తే మన చుట్టూ ‘మంత్ర కవచం’ అనే రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల శక్తిని నింపుతుంది. ఏకాగ్రత పెంచి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. భగవంతునితో అనుసంధానం కావడానికి, ఆత్మశాంతిని పొందడానికి మంత్ర పఠనం ఓ సులభమైన మార్గం.