News February 1, 2025
నల్గొండ: రాజకీయ పార్టీల నేతలతో సమావేశం
నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లో జిల్లాలోని రాజకీయ పార్టీ నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నారు. పోలింగ్ స్టేషన్ల ఖరారుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలు పై రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని రాజకీయ నేతలకు అధికారులు తెలిపారు.
Similar News
News February 2, 2025
నేటి నుంచే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు భక్తులకు వసతులు, ఆలయానికి రంగులు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతిలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి జాతరకు సుమారుగా 12 లక్షల వరకు భక్తులు రావచ్చని అంచనా వేశారు.
News February 2, 2025
పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!
నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.
News February 1, 2025
చెర్వుగట్టు ఆలయ స్థల పురాణం ఇదే!
చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.