News February 2, 2025
HYDలో ZERO బడ్జెట్ ఫ్లెక్సీ (VIRAL)

హైదరాబాద్‌లో ZERO బడ్జెట్ ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. 8 మంది BJP ఎంపీలు, 8 మంది INC ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని BRS నేతలు విమర్శలకు దిగారు. ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ భాగస్వామి’ అంటూ కిషన్ రెడ్డి, ‘దేశ గతిని మార్చే బడ్జెట్ ఇది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు సైతం ఫైర్ అయ్యారు. మరి సెంట్రల్ బడ్జెట్‌పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News September 15, 2025
కళాశాలల బంద్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల మార్పు..!

వరంగల్ జిల్లాలో ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని కళాశాలలో బంద్ నేటి నుంచి నిర్వహిస్తున్నారు. దీంతో ఈనెల 15, 17, 19వ తేదీల్లో జరగాల్సిన ఫార్ము డీ ఫస్ట్ ఇయర్ పరీక్ష కేంద్రాలను మారుస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. వాటి వివరాలు కేయూ. ఏసీ.ఇన్‌లో చూడొచ్చని, LLB ఐదేళ్ల ఆరో సెమిస్టర్ పరీక్షను సైతం సుబేదారి వర్సిటీ మహిళా కాలేజీకి మార్చమన్నారు.
News September 15, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కొలనుపాక విద్యార్థులు

కొలనుపాక ZPHSకు చెందిన నలుగురు విద్యార్థులు 35వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ధనుష్, మనోజ్ కుమార్, కార్తీక్, చండేశ్వర్ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముష్కర్‌లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు.
News September 15, 2025
ఖమ్మం: ఆ గ్రామంలో కోతులను పట్టేస్తున్నారు..!

ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో కోతుల బెడదకు గ్రామస్థులు పరిష్కారం కనుగొన్నారు. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టించడంతోపాటు మనుషులు, పిల్లలపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం గ్రామస్థులు కోతులు పట్టేవారిని పిలిపించి, వాటిని బోనులో పట్టుకున్నారు. వాటిని అడవిలో విడిచిపెట్టి, గ్రామంలో శాంతి నెలకొల్పడానికి కృషి చేస్తున్నారు.